పొగాకు ధరలు చూసి కౌలు పెంచుకోవద్దు
ఈ ఏడాది మార్కెట్లో లభించిన పొగాకు ధరలు చూసి... వచ్చే సీజన్‌కు బ్యారన్, పొలం కౌలు ధరలు పెంచుకోవద్దని బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
అరక దున్ని ఏరువాక ప్రారంభిస్తున్న పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ ఏడాది మార్కెట్లో లభించిన పొగాకు ధరలు చూసి... వచ్చే సీజన్‌కు బ్యారన్, పొలం కౌలు ధరలు పెంచుకోవద్దని బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రెండో వేలం కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఏరువాక పౌర్ణమిలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మాండౌస్ తుపాను కారణంగా కొంత మేర పొగాకు తోటలు దెబ్బతిన్నా... డిమాండ్ దృష్ట్యా మంచి ధరలు లభించడం రైతులకు లాభదాయకంగా మారిందన్నారు. వచ్చే ఏడాది కూడా బోర్డు అనుమతి మేర మాత్రమే పంట విస్తీర్ణం సాగు చేయాలని సూచించారు. అనధికార పంట ఉత్పత్తిపై అపరాధరుసుము విధింపుపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు బయట వ్యాపారులకు అమ్ముతున్నారని... దీనివల్ల రైతులకే నష్టం వాటిల్లుతుందన్నారు. ఏరువాకను దృష్టిలో ఉంచుకుని 13 కిలోల నవధాన్యాల సంచులను ప్రతి వేలం కేంద్రం పరిధిలోని అయిదుగురు రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎద్దులతో అరక దున్ని సాగు ప్రారంభించారు. కార్యక్రమంలో బోర్డు ఎక్స్‌టెన్షన్ మేనేజర్ దామోదర్, బోర్డు ప్రాంతీయ కార్యనిర్వహణాధికారి లక్ష్మణరావు, బోర్డు సభ్యుడు ఎం.సుబ్బారెడ్డి, బి.బ్రహ్మయ్య, వరప్రసాద్, ఐటీసీ లీఫ్ మేనేజర్ శివకుమార్, జీపీఐ మేనేజర్ ప్రభాకర్, వేలం కేంద్రం అధికారి కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Boney Kapoor: శ్రీదేవి మరణం.. డైట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది: బోనీ కపూర్
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ