logo

మచిలీపట్నం-తిరుపతి ప్యాసింజర్‌ రైల్లో పొగలు

మచిలీపట్నం-తిరుపతి ప్యాసింజర్‌ రైలులో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పొగలు వ్యాపించాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఈ రైలు టంగుటూరు సమీపంలోకి రాగానే ఓ బోగీ లోపల నుంచి పొగలు వచ్చాయి.

Published : 06 Jun 2023 03:23 IST

టంగుటూరు సమీపంలో ఆగిన రైలు నుంచి వస్తున్న పొగలు

టంగుటూరు, న్యూస్‌టుడే: మచిలీపట్నం-తిరుపతి ప్యాసింజర్‌ రైలులో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పొగలు వ్యాపించాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఈ రైలు టంగుటూరు సమీపంలోకి రాగానే ఓ బోగీ లోపల నుంచి పొగలు వచ్చాయి. అందులో ఉన్న ప్రయాణికులు పొగను గమనించి టంగుటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే చైన్‌లాగి కిందికి దిగారు. ఈ క్రమంలో కొంత మంది రైలు నుంచి దూకి పరుగులు తీశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సిబ్బంది వచ్చి పరిశీలించారు. పొగలు ఆగిపోవడంతో అధికారులు సిగ్నల్‌ ఇవ్వగా మచిలీపట్నం వైపు బయలుదేరి వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని