logo

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Published : 07 Jun 2023 03:27 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, చిత్రంలో జేసీ శ్రీనివాసరావు, డీఆర్వో శ్రీలత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియ, రెవెన్యూ అంశాలపై అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయమై మండల స్థాయిలో చేపట్టిన చర్యల వివరాలతో నివేదిక పంపాలన్నారు. స్పందన కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని... పదే పదే అవే ఫిర్యాదులు రాకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. ప్రతి రోజు కనీసం 30 ఎకరాలు రీసర్వే చేయాలని సూచించారు. చుక్కల భూములకు సంబంధించి రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సాదాబైనామా కేసుల పరిష్కారంలోనూ పురోగతి కనిపించాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో పెండింగ్‌ క్ష్లెయిమ్‌లను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీనివాసరావు, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేదు మాధవన్‌, శిక్షణ ఐఏఎస్‌ అధికారి శౌర్య పటేల్‌, డీఆర్‌వో శ్రీలత, ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు విశ్వేశ్వరరావు, అజయ్‌కుమార్‌, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, చెన్నయ్య, గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని