logo

సచివాలయానికి కరెంట్‌ కట్‌

మండలంలోని హాజీపురం సచివాలయానికి విద్యుత్తు బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో వారం రోజులుగా సరఫరా నిలిపివేశారు.

Published : 07 Jun 2023 03:27 IST

‌బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేత

విద్యుత్తు సరఫరా లేక ఖాళీగా కూర్చున్న సిబ్బంది

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని హాజీపురం సచివాలయానికి విద్యుత్తు బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో వారం రోజులుగా సరఫరా నిలిపివేశారు. ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి, సర్పంచి మధ్య అవగాహన లేకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగలేదు. కొద్దిరోజుల క్రితం విద్యుత్తు శాఖ అధికారులు బిల్లులు చెల్లించాలని కోరినా పట్టించుకోలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరఫరా నిలిపి వేసినట్లు లైన్‌మేన్‌ బి.రవి తెలిపారు. దీంతో వివిధ పనుల కోసం ఇక్కడికి వస్తున్న ప్రజలు వెనుదిరుగుతున్నారు. విద్యుత్తు సరఫరా నిలిపివేసిన తర్వాత ఒక్కరోజు మాత్రమే బ్యాటరీలతో పనులు జరిగాయని సిబ్బంది తెలిపారు. ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లు చెల్లించేందుకు ఎన్నిసార్లు చెప్పినా సర్పంచి స్పందించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిధులు వీధి దీపాల నిర్వహణకే సరిపోవడం లేదని, రెండు రోజుల్లో విద్యుత్తు బిల్లులు చెల్లిస్తామని సర్పంచి వై.సుబ్బులు తెలిపారు. ఈ విషయమై ఎంపీడీవో ఈశ్వరమ్మను వివరణ కోరగా విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడామని, ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే బిల్లులు చెల్లిస్తామని, సరఫరా చేయాలని కోరామన్నారు. ఈ మేరకు సర్పంచి, పంచాయతీ కార్యదర్శికి  సూచనలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు