logo

రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌ దుర్మరణం

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొన్న ఘటనలో  క్లీనర్‌ మృతి చెందారు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

Updated : 07 Jun 2023 05:54 IST

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన సంగం డెయిరీ లారీ

త్రిపురాంతకం, న్యూస్‌టుడే : ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొన్న ఘటనలో  క్లీనర్‌ మృతి చెందారు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు...పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన గల్లా ఆంజనేయులు(23) గత నెల రోజులుగా సంగం డెయిరీ చెందిన లారీకి క్లీనర్‌గా వెళ్తున్నారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్‌ నరేంద్రతో కలిసి డైరీ నుంచి సరకు తీసుకుని దోర్నాల, మార్కాపురంలో ఉన్న పాయింట్లలో దింపారు. తిరిగి డెయిరీకి వెళ్తున్న క్రమంలో దూపాడు వద్దకు రాగానే ముందు నిలబడి ఉన్న లారీని క్లీనర్‌ కూర్చున్న వైపు బలంగా ఢీ కొట్టింది. దీంతో డైరీకు చెందిన లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో క్లీనర్‌ ఆంజనేయులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్‌ నరేంద్రకు స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో త్రిపురాంతకం లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకట సైదులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆంజనేయులుకు భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని