logo

లారీ చోదకుడిపై దాడి... ఫోన్‌పేలో డబ్బుల దోపిడీ

మండల పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి విశ్రాంతి తీసుకుంటున్న లారీ చోదకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నగదు దోచుకెళ్లారు.

Published : 07 Jun 2023 03:27 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి విశ్రాంతి తీసుకుంటున్న లారీ చోదకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నగదు దోచుకెళ్లారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కనుమళ్ల జాతీయ రహదారి సమీపంలోని అత్యవసర విమానాల నిలుపుదల ప్రాంతంలో రహదారి వెంబడి చెన్నై నుంచి కాకినాడ వెళ్తున్న లారీని చోదకులు నిలుపుదల చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని అయిదుగురు వ్యక్తులు లారీలోకి చొరబడి నిద్రిస్తున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచి వారి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లారు. లారీ చోదకుల వద్ద ఉన్న డబ్బులతోపాటు, ఫోన్‌పేలో ఉన్న సొమ్ము మొత్తం కలిపి రూ.32 వేలు తీసుకెళ్లారు. అనంతరం స్థానికులు 108కు సమాచారం అందించడంతో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడిన లారీ డ్రైవర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన సీహెచ్‌ వెంకటేశ్వర్లు. అతడిని ప్రాథమిక చికిత్స అందించి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై ఫిరోజఫాతిమాను వివరణ కోరగా బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని