logo

బాల్య వివాహాల నియంత్రణపై దృష్టి

జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో అభివృధ్ధి అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.

Published : 07 Jun 2023 03:27 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో అభివృధ్ధి అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ స్థాయిలో ప్రతి వివాహాన్ని ఆధార్‌ కార్డు ప్రకారం వివరాలను మహిళా పోలీసులు నమోదు చేయాలన్నారు. తక్కువ వయస్సు ఉన్నవారిని గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని తెలిపారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను పెంచాలని, వాటిపై ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు. సచివాలయ సిబ్బంది ఉదయం, సాయంత్ర వేళల్లో బయోమెట్రిక్‌ హాజరు కచ్చితంగా వేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, ట్రైనీ ఐఏఎస్‌ శౌర్య పటేల్‌, సీపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ పీడీ పేరయ్య, ఐసీడీఎస్‌ పీడీ ధనలక్ష్మి, జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

గృహ లబ్ధిదారులకు కాల్‌ సెంటర్

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కలెక్టర్‌ ఆదేశాల మేరకు గృహ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలో జిల్లాస్థాయి కాల్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి పేరయ్య తెలిపారు. ఆ కేంద్రంలో సిబ్బంది బుధవారం నుంచి అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. సమస్యలపై 709393 0922కు ఫోన్‌ చేసి చెప్పవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని