ఆ ఎమ్మెల్యే చంపుతానంటున్నారు
‘నా నివాసం వద్ద ఎమ్మెల్యే అనుచరులు రెక్కీ నిర్వహించారు. ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అక్కడే ఉంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
ఎస్పీ మలికాగార్గ్‌కు ఫిర్యాదు ప్రతి అందిస్తున్న వైకాపా నాయకుడు సూర్యప్రకాష్‌రెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘నా నివాసం వద్ద ఎమ్మెల్యే అనుచరులు రెక్కీ నిర్వహించారు. ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అక్కడే ఉంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించండి’ అని మార్కాపురానికి చెందిన వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ను గురువారం కలిసి ఫిర్యాదు అందజేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డిలపై సూర్యప్రకాష్‌రెడ్డి ఇటీవల పలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఛోటా నయీమ్‌గా వ్యవహరిస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత కొన్నిరోజులపాటు సూర్యప్రకాష్‌రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గత కొన్నిరోజులుగా అక్కడే ఉంటూ మళ్లీ మార్కాపురం ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఆయన సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అదే పార్టీకి చెందిన నాయకుడే పోలీసు రక్షణ కోరటం ఇక్కడ గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం