logo

దస్త్రాల నిర్వహణ తీరు పరిశీలన

ఈ-దస్త్రాల వ్యవస్థను కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని పలు విభాగాలను ఆయన గురువారం తనిఖీ చేశారు.

Published : 09 Jun 2023 04:59 IST

అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ-దస్త్రాల వ్యవస్థను కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని పలు విభాగాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. పరిపాలనా విభాగంలోని వివిధ సెక్షన్లల్లో దస్త్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. విభాగాల్లోని దస్త్రాలను నిల్వ ఉంచుకోవద్దని, వీటిని ఈ-దస్త్రాలుగా మార్చుకున్నాక రికార్డు గదిలో భద్రపరచాలని సూచించారు. దస్త్రాలు కనిపించకపోవడం వంటి ఉదంతాలు వెలుగుచూస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయా విభాగాల పర్యవేక్షకులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా మరుగుదొడ్లను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అద్దె భవనాల్లో ఉంటున్న శాఖలకు కలెక్టరేట్‌లోని కార్యాలయాలను సర్దుబాటు చేసే దిశగా ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రకాశం భవనానికి అవసరమైన మరమ్మతులను చేపట్టడానికి అంచనాలు రూపొందించాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్వో ఆర్‌.శ్రీలత, కలెక్టరేట్‌ పర్యవేక్షకులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని