హనుమాయమ్మ కుటుంబానికి తెదేపా అండ
టంగుటూరు మండలం రావివారిపాలెంలో వైకాపా నాయకుడి దాడిలో మృతిచెందిన అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ కుటుంబానికి తెదేపా అండగా నిలిచింది.
రూ.5 లక్షల ఆర్థిక సాయం
మృతురాలి కుటుంబానికి సాయం అందిస్తున్న దామచర్ల సత్య, తెదేపా నాయకులు
టంగుటూరు, న్యూస్‌టుడే: టంగుటూరు మండలం రావివారిపాలెంలో వైకాపా నాయకుడి దాడిలో మృతిచెందిన అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ కుటుంబానికి తెదేపా అండగా నిలిచింది. గురువారం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, మండల పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా హనుమాయమ్మ కుమార్తె మాధురి హత్య జరిగిన తీరును వారికి వివరించి కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి భర్త సుధాకర్, కుమారుడు మారుతీరావులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో బాధిత కుటుంబాన్ని కలిసి భరోసా ఇస్తారని చెప్పారు.
నిందితుడికి శిక్ష పడే వరకు పోరాటం: హనుమాయమ్మ హత్య కేసులో నిందితుడు కొండలరావుకు శిక్ష పడే వరకు తామంతా పోరాడతామని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య స్పష్టంచేశారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రావివారిపాలెం వచ్చిన సత్య విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎస్సీ సెల్ నాయకుడు సుధాకర్‌పై వైకాపా కార్యకర్తలు పలుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా, తాము ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ల చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో బెజవాడ వెంకటేశ్వర్లు, కామని నాగశ్రీను, బ్రహ్మానందం, తోకల భారతి, మద్దిరాల మమత, కసుకుర్తి భాస్కర్, అబ్బూరి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్