logo

‘ఉద్యోగాలివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం’

పాఠశాలలు తెరిచేలోగా ఉద్యోగాలు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ టీచర్స్‌ వాపోయారు.

Updated : 10 Jun 2023 05:52 IST

మాట్లాడుతున్న 98 డీఎస్సీ అభ్యర్థులు శ్రీనివాసరావు, రమేష్‌, రంగస్వామి

మంగళగరి, న్యూస్‌టుడే: పాఠశాలలు తెరిచేలోగా ఉద్యోగాలు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ టీచర్స్‌ వాపోయారు. మంగళగిరి ప్రెస్‌ క్లబ్‌లో నెల్లూరుకు చెందిన భైరవకోన శ్రీనివాసరావు, పులివెందులకు చెందిన పట్నం రమేష్‌, కర్నూలుకు చెందిన రంగస్వామి శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రెండున్నర దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం, గుంటూరు, వైఎస్‌ఆర్‌ కడప, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, నెల్లూరు, విజయనగరం జిల్లాలకు చెందిన 2,642 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఉన్నారని తెలిపారు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరగడం వల్ల తమకు అన్యాయం జరిగిందన్నారు. 6,752 మందికి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ జరిగితే అసెంబ్లీలో స్వయాన సీఎం 5,887 పోస్టులు ఇస్తున్నట్లు ప్రకటించారని, అయితే 4,072 మందికి మాత్రమే పోస్టింగ్‌ ఇచ్చారని తెలిపారు. మిగిలిన వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలలు తెరిచేలోగా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని