విద్యుత్తు శాఖ అధికారుల ఆకస్మిక దాడులు
ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్న విజిలెన్స్ ఉన్నతాధికారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 34 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్తు వినియోగిస్తున్న వారిపై జరిమానాలు విధించారు. మాల్ ప్రాక్టీస్, అదనపు లోడుకు సంబంధించి మొత్తం 2,923 సర్వీసులు తనిఖీ చేయగా, అందులో 236 మందికి రూ.6.19 లక్షల అపరాధ రుసుం విధించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్‌ఈ ఎం.అల్ఫాన్స్, ఈఈ టి.శ్రీనివాసరావు, ఈఈ వి.శ్రీనివాసులు, డీఈ మోహనరావు, ఏఈ చెన్నారెడ్డితోపాటు, ఒంగోలు డివిజన్ పరిధిలోని విద్యుత్తు శాఖ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
27 కేసులు.. రూ.2,28,700 జరిమానా..
త్రిపురాంతకం, న్యూస్‌టుడే : త్రిపురాంతకం మండలంలోని అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్న వినియోగదారులపై విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఒంగోలు డీపీఈ డీఈ హైమావతి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్న వారిపై 77 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రూ.2,28,700 లు వారిపై అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. ఎవరైనా అక్రమంగా విద్యుత్తు దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో డీపీఈ ఏడీఈ శ్రీనివాసరావు, డీపీఈ ఏఈ కోటేశ్వరరావు, మార్కాపురం విద్యుత్తు ఆపరేషన్ సబ్-డివిజన్‌లోని పలు అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral video: థార్‌లో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు యత్నం.. వీడియో వైరల్!
-
Social Look: అభిమానులను మిస్ అయిన నివేదా.. చాట్ చేసేందుకు నర్గిస్ వెయిటింగ్!
-
Palnadu: తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
-
Disney+Hotstar: క్రికెట్ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్లతో రెడీ
-
Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్
-
Vivek Ramaswamy: వివేక్ పిల్లల.. ‘కేర్ టేకర్’ జీతం రూ.80లక్షలు..?