logo

సకల జనం.. సంఘీభావం

వైకాపా ప్రభుత్వ అరాచక విధానాలపై సకల జనులు భగ్గుమంటున్నారు.

Published : 22 Sep 2023 01:38 IST

అక్రమాన్ని ఏకేస్తా: దూదిని ఏకే కమాన్‌తో నూర్‌ బాషా సంఘం నేత బారాఇమామ్‌

కక్షపై ప్రేమ గెలవాలని...: ఒంగోలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పాస్టర్లు

ఈనాడు, ఒంగోలు: వైకాపా ప్రభుత్వ అరాచక విధానాలపై సకల జనులు భగ్గుమంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలకు తరలివచ్చి తమ అసంతృప్త గళాలను వినిపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి త్వరగా బయటికి రావాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో తెదేపా ఎస్సీ, ఎస్టీ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న మార్కాపురంలోని దీక్షా శిబిరంలో కొనకనమిట్ల మండలానికి చెందిన తెలుగు తమ్ముళ్లు కూర్చున్నారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో, యర్రగొండపాలెంలో నియోజకవర్గ బాధ్యుడు గుడూరి ఎరిక్షన్‌బాబు నేతృత్వంలో దీక్షలు కొనసాగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగం నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కనిగిరిలో కుల వృత్తులను ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబుకు అండగా నిలుస్తామంటూ ప్రతినబూనారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు కరపత్రాలను పంచి పెట్టారు. చీమకుర్తి శిబిరంలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు., కొండపి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తమ దీక్ష కొనసాగించారు.

మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆందోళన

బాబు రావాలి.. ‘గీత’ మారాలి...: కనిగిరిలో బ్యానర్‌పై సంతకం చేస్తున్న కల్లుగీత కార్మికుడు రంగయ్య

గంప, చాటలతో కనిగిరి దీక్షా శిబిరంలో మేదర సంఘం నాయకుడు నరసింహస్వామి


నిజాలు చూడలేని ప్రభుత్వం...: కళ్లకు గంతలు కట్టుకుని ఒంగోలులో
తెదేపా ఎస్సీ, ఎస్టీ విభాగం నాయకుల నిరసన

ముండ్లమూరు: చంద్రబాబు విడుదల కోరుతూ పోలవరంలో
వినాయక విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్న మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని