logo

ఓపీఎస్‌ సాధించే వరకు పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌ అమలు చేసేంతవరకు తాము  పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Published : 27 Sep 2023 03:57 IST

యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు

పొదిలిలో జెండావిష్కరణలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు, చిత్రంలో సంఘం నేతలు

పొదిలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌ అమలు చేసేంతవరకు తాము  పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాల్లో భాగంగా మంగళవారం  రాష్ట్ర జాత పొదిలికి చేరింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెమ్మని బాలవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొదిలి ప్రాంతీయ కార్యాలయంలో యూటీఎఫ్‌ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ అమలుచేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగులను మోసం చేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ విధానాన్ని యూటీఎఫ్‌ ఫూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేబినెట్‌లో ముఖ్యమంత్రి పునరాలోచించి పాత పెన్షన్‌ విధానానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోతో ప్రభుత్వ పాఠశాలలు కుంటుపడుతున్నాయన్నారు. ప్రాథమిక విద్య కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాలు అక్టోబరు 1న విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. 15 వేల మంది ఉపాధ్యాయులు తమ గొంతుకను వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఓవీ.వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రవి, సహాధ్యక్షుడు అబ్దుల్‌హై, నాయకులు బాలవెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, జి.రమేష్‌, బుజ్జిబాబు, చవలం వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, ఎస్‌.సుబ్బారావు, ఆంజనేయరెడ్డి, నరసారెడ్డి, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని