logo

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరి మృతి

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

Updated : 27 Sep 2023 10:35 IST

కురిచేడు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడులో ట్రాక్టర్‌పై వినాయకుడిని ఊరేగిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో చమిడిపెట్టి శ్రీను (32), మరో బాలుడు(11) ఉన్నారు. విగ్రహం చుట్టూ ఇనుప కడ్డీలతో లైటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా 11కేవీ విద్యుత్‌ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని