logo
Published : 27/11/2021 05:38 IST

సంక్షిప్త వార్తలు

ఆదిత్యాలయంలో నేటి నుంచి పారాయణం  

అరసవల్లి, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో శనివారం నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు భగవద్గీత పారాయణం నిర్వహించనున్నట్లు ఈవో సూర్యప్రకాశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 28న సాయంత్రం 5 గంటలకు బాల బ్రహ్మానంద సరస్వతి గురూజీ ప్రవచనం ఉంటుందన్నారు. 29న కార్తిక సోమవారం సందర్భంగా సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నట్లు ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.


ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

శ్రీకాకుళం విద్యావిభాగం, న్యూస్‌టుడే: డీఎస్సీ-2018 స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, భాషాపండితుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు డీఈవో లింగేశ్వరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల జాబితా డీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.  శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం వారికి  నియామక పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు.


లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలోని మహిళల నిష్పత్తి తక్కువగా ఉండటానికి కారణం లింగనిర్ధారణ పరీక్షలేనని శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిశోర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఆర్డీవో కార్యాలయంలో పీసీ పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా పెంచాలన్నారు. ఎవరైనా ఆడశిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించినట్లయితే 102, 104 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఆడపిల్లల ప్రాముఖ్యాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జగన్నాథరావు, అదనపు డీఎంహెచ్‌వో కె.రామ్మూర్తి, డా.గిరిదొర, తదితరులు పాల్గొన్నారు.


సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్‌ మూడు, ఐదు, బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ మూడో సెమిస్టర్‌లో 122, ఐదులో 158, బీఈడీలో 901, బీపీఈడీలో 117, డీపీఈడీలో 18 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వీటిని వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, ఎలాంటి సందేహాలున్నా 15 రోజుల్లో పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని మళ్లీ పరిశీలించి అర్హత ఉంటే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. .

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని