logo
Published : 27/11/2021 05:38 IST

లక్ష్మింపేట కేసు మళ్లీ వాయిదా


ప్రత్యేక న్యాయస్థానం వద్ద పోలీసు బలగాలు  

వంగర, న్యూస్‌టుడే: లక్ష్మింపేట కేసు మరోసారి వాయిదా పడింది. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో జిల్లా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి కె.శ్రీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ కేసులో మొత్తం 80 మందిని నిందితులుగా పేర్కొనగా వీరిలో నలుగురు గతంలో మృతి చెందారు. 64 మంది విచారణకు హాజరు కాగా మిగిలిన వారి తరఫున న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం న్యాయమూర్తి కేసును డిసెంబరు 17కి వాయిదా వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్పీ విఠలేశ్వరరావు ఆధ్వర్యంలో వంద మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ ఎం.శ్రావణి, రాజాం రూరల్‌ సీఐ డి.నవీన్‌కుమార్‌, వంగర ఎస్‌ఐ దేవానంద్‌ పర్యవేక్షించారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని