Published : 27 Nov 2021 05:38 IST
ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయం
ప్రయాణికుల సౌకర్యమే ప్రధాన ధ్యేయమని వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ శత్పథి పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణలోని దుకాణదారులు డీఆర్ఎంకు తమ సమస్యలు వివరించారు. సీనియర్ డీసీఎం కేకే త్రిపాఠి, సీనియర్ డీవోఎం సునీల్ కుమార్, ఏడీఈఎన్ అవదేశ్‌కుమార్, స్టేషన్ మేనేజర్ రవి పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం
Tags :