logo
Updated : 27/11/2021 19:21 IST

రెడ్‌క్రాస్ క్రియాశీలకంగా పనిచేస్తోంది

గుజరాతీపేట: రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్‌ వద్ద రెడ్ క్రాస్ మెడిసిన్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన దంత వైద్యం, ఆయుర్వేద వైద్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు. రెడ్‌క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్‌ రావు మెడిసిన్ బ్యాంక్ సేవలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దంత, ఆయుర్వేద, హోమియో, ఫిజియోథెరపీ, నేత్ర తదితర విభాగాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్ క్రియాశీలకంగా పనిచేస్తోందని కలెక్టర్ అన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని