logo
Published : 30/11/2021 04:59 IST

బంగారం మాయం కాలేదట..!

అరసవల్లిలో ఒక్కరోజులోనే విచారణ పూర్తి


దస్త్రాలు తనిఖీ చేస్తున్న ఆర్‌జేసీ సురేష్‌బాబు
అరసవల్లి, న్యూస్‌టుడే: సరిగ్గా 26 నెలల కిందట జరిగిన విజిలెన్స్‌ తనిఖీల సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో వెలుగు చూసిన బంగారం మాయంపై ఎట్టకేలకు సోమవారం విచారణ జరిగింది. స్వామివారి బంగారం మాత్రం మాయం కాలేదని విచారణకొచ్చిన అధికారులు తేల్చారు. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో జరిగిన విజిలెన్స్‌ విచారణ నివేదిక చూడకుండానే, ఎలా అక్రమాలు జరిగాయో తెలుసుకోకుండానే ప్రస్తుత విచారణ ఒక్క రోజులోనే జరిగిపోయింది. విజిలెన్స్‌ తనిఖీలు, అక్రమాలపై అప్పట్లో కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా అప్పటి ఘటనపై దేవాదాయశాఖ కమిషనరు ఆదేశాల మేరకు ప్రాంతీయ కమిషనర్‌ ఎం.వి.సురేష్‌బాబు, జ్యూయలరీ వెరిఫికేషన్‌ అధికారి వి.వి.ఎస్‌.కె.ప్రసాద్‌ ఆలయానికి వచ్చి దస్త్రాలు పరిశీలించారు. విజిలెన్స్‌, దేవాదాయ శాఖ అధికారుల నివేదికలూ విరుద్ధంగా ఉండటం గమనార్హం. 2019 ఆగస్టు 4, 12వ తేదీల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో అరకిలో బంగారం మాయమైనట్లు గుర్తించారు. 2011-2019 మధ్యలో భక్తులు సమర్పించిన వెండి, బంగారు కానుకలను బ్యాంకులో జమ చేయకుండా ఆలయ కార్యాలయంలోనే ఉంచిన విషయాన్ని గుర్తించారు. ఆ నివేదికను డీజీకి సమర్పించారు. తాజా విచారణలో మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ‘రసీదుల ప్రకారమే విచారణ జరిపాం. ప్రస్తుతం స్వామివారికి 17 కిలోల 213 గ్రాముల 248 మి.గ్రా. బంగారు, 501 కిలోల 292 గ్రాముల 36 మి.గ్రా వెండి ఆభరణాలు ఉన్నాయి. దస్త్రాల ప్రకారం లెక్క సరిపోయింది. విజిలెన్స్‌ నివేదిక చూడలేదు.’ అని ప్రాంతీయ కమిషనరు సురేష్‌బాబు పేర్కొన్నారు.

 

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని