logo
Published : 30/11/2021 04:59 IST

అన్నదాతల నడ్డి విరిచిన ‘స్వర్ణ’

న్యూస్‌టుడే, నరసన్నపేట

స్వర్ణ రకం సాగు చేస్తే తమ ఇంట సిరులు కురుస్తాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి కుళ్లిపోయి రైతులను నిలువునా ముంచింది. 2017 వరకు దీని సాగు క్రమేణా తగ్గగా, అనంతర పరిస్థితుల వల్ల మళ్లీ పుంజుకుంది. ఈ ఏడాది సాగు చేసిన మొత్తం పంటలో చాలావరకు నేలవాలింది. ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో నీట మునిగిన పైరును బయటకు తీసేసరికే కుళ్లిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ రకం వేసిన రైతులు ఇంతవరకు పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా మంచి దిగుబడులొస్తాయని ఆశించినా, అధిక వర్షాలతో ఒక్కసారిగా దిగులు చెందారు. కనీసం వరి పనలు బయటకు తీద్దామన్నా అనుకూలించడం లేదని ఈ సారి స్వర్ణ రకం తమను నిలువునా ముంచిందంటున్నారు అన్నదాతలు.


నేలపై పడిపోయిన స్వర్ణ రకం వరి చేను

బరువు పెరిగి ఒరిగింది: జిల్లా వ్యాప్తంగా స్వర్ణ రకం సాగుచేసిన రైతులు అందరికీ ఈ సమస్య ఎదురైంది. వరి కంకుల బరువు ఎక్కువగా ఉండటం, కాండం బలహీనపడటంతో చిన్నపాటి గాలికే ఒరిగిపోయాయి. ముఖ్యంగా ఎరువుల వినియోగంలో రైతులకు అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణం. 15 కి.మీ. వేగంతో వచ్చిన గాలులకే ఈ రకం నేలకు ఒరుగుతుంది.

- డాక్టర్‌ చిన్నంనాయుడు, కేవీకే సమన్వయాధికారి, ఆమదాలవలస


 జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం : 5.1 లక్షల ఎకరాలు

● స్వర్ణ : 66,300 ఎకరాలు

● ఎదురైన సమస్య : భారీ వర్షాలతో నేలకొరిగిన వరి పైరు

● 2017లో స్వర్ణ సాగు విస్తీర్ణం : 9 శాతం

● ఈ ఏడాది : 13 శాతం


 

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని