logo
Published : 30/11/2021 04:59 IST

ఇంటింటా యజ్ఞం!

నేడు ఓటీఎస్‌పై ప్రత్యేక డ్రైవ్‌

రాజాం, న్యూస్‌టుడే: గతంలో నిర్మించిన ఇళ్లకు మంజూరు చేసిన రుణాలను వన్‌టైం సెటిల్‌ మెంట్‌(ఓటీఎస్‌) కింద రాబట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రతువులో భాగంగా మంగళవారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ప్రత్యేకాధికారులు, పురపాలిక కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఇలా అందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో పది మందికి తక్కువ కాకుండా లబ్ధిదారులతో నగదు కట్టించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్యాలకు చేరువయ్యేందుకు సోమవారం లబ్ధిదారులతో సొమ్ము కట్టించుకున్నా వాటిని ఈ డ్రైవ్‌ ఖాతాలో వేసేలా సిబ్బంది వద్దే ఉంచుకున్నారు. 306 మంది చలానాలను పూర్తి చేసినా నగదు కట్టలేదు. మరోపక్క ఓటీఎస్‌పై అవగాహన కల్పిస్తున్నా కొన్నిచోట్ల లబ్ధిదారుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ‘ఎన్‌టీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.6 వేలు వ్యయంగా నిర్ణయించారు. రూ.3 వేలు రాయితీగా అందించారు. మిగిలిన రూ.3 వేలు గృహ నిర్మాణ సంస్థ రుణంగా ఇచ్చింది. ఇప్పుడు అదే ఇంటికి రూ.10 వేలు కట్టమంటే ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీఎస్‌కు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యులు సహకరించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే కలెక్టరు శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో గత ఆదివారం దూరదృశ్య సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సైతం నరసన్నపేటలో సోమవారం సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.


● మొత్తం ఇళ్లు 2,93,894 ●

చెల్లించిన వారు 6,804

● సమకూరిన మొత్తం రూ.719.33 లక్షలు


 

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని