logo
Published : 04/12/2021 03:46 IST

సుకవి ‘భావశ్రీ’ ఇకలేరు


రామారావు(పాతచిత్రం)

శ్రీకాకుళం సాంస్కృతికం, జి.సిగడాం. న్యూస్‌టుడే: బహుభాషల్లో పండితుడైన భావశ్రీ (వాండ్రంగి రామారావు) శుక్రవారం వేకువ జామున కన్నుమూశారు. జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన ఆయన పదమూడేళ్ల వయసులోనే కవితా వ్యవసాయం ప్రారంభించారు. తెలుగు పండితుడిగా ఉద్యోగ విరమణ చేసిన ఈయన భావశ్రీ, పంచవటి, రుక్మిణికృష్ణ, హృదయవీణ, వెన్నెల వెలుగులు, భారత రామాయణం, పారిజాత పరిమళాలు, మనుశోభలు, షేక్‌స్పియర్‌ రాగాలు వంటివి 70కిపైగా రచనలు చేశారు. అధికార భాషా సంఘంలో మూడు సార్లు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణిలో 500కు పైగా సాహితీ ప్రసంగాలు చేశారు. బందరు పిచ్చోడు, అగ్నిశిఖరం వంటి చిత్రాల్లో గీతాలు రాశారు. సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లాశాఖ అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భావశ్రీ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు అని రాష్ట్రభాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు, శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో అన్నారు. తెలుగు రచయితల వేదిక ప్రతినిధులు, తెలుగు వెలుగు చరవాణి బృందం, పలువురు సాహితీ సంస్థల ప్రతినిధులు సంతాపం ప్రకటించారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని