logo

‘క్షమించమని కోరుతున్నా..’

‘ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాదు. ఉన్నతాధికారులు ఏమంటారోనని భయపడి ఆరోజు మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను తప్పుగా మాట్లాడానని మీరు అనుకోవచ్చు,...

Published : 07 Dec 2021 05:45 IST


వీఆర్వోలకు సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మత్‌ సమక్షంలో క్షమాపణ చెబుతున్న కమిషనర్‌ రాజగోపాలరావు

పలాస, న్యూస్‌టుడే: ‘ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాదు. ఉన్నతాధికారులు ఏమంటారోనని భయపడి ఆరోజు మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను తప్పుగా మాట్లాడానని మీరు అనుకోవచ్చు, కానీ అప్పటి పరిస్థితి, ఉన్నతాధికారుల ఆదేశాల కారణంగా అలా చేయాల్సి వచ్చింది. అందరు వీఆర్వోలు, తహసీల్దార్లకు క్షమాపణ తెలియజేసుకుంటున్నా... థాంక్యూ...’ అంటూ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కమిషనర్‌ టి.రాజగోపాలరావు టెక్కలి సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మత్‌ సమక్షంలో వీఆర్వోలు, తహసీల్దార్లకు సోమవారం క్షమాపణ చెప్పారు. కమిషనర్‌ క్షమాపణ చెప్పినందున మీరంతా క్షమాగుణంతో విధులు నిర్వహించండంటూ వీఆర్వోలు, తహసీల్దార్లను సబ్‌కలెక్టర్‌ కోరారు. ఈ నెల ఒకటిన ఓటీఎస్‌పై అవగాహన సదస్సు సందర్భంగా కమిషనర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

మంత్రి చెప్పాలి: తమను సచివాలయాలకు రావొద్దని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ఎదుట మంత్రితో క్షమాపణ చెప్పించాలని వీఆర్వోలు పేర్కొన్నారు. దీంతో తాను వచ్చింది కమిషనర్‌తో ఉన్న సమస్య పరిష్కరించడానికేనని, మీరేం చేస్తారో మీ ఇష్టం.. అంటూ సబ్‌కలెక్టర్‌ సమావేశం ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని