logo
Published : 07/12/2021 05:45 IST

చిన్నారిని వదిలి.. విగతజీవులుగా ఇంటికి!


అక్క హైమావతి మృతదేహం వద్ద విలపిస్తున్న సూరన్నాయుడు

తిరుపతి(వైద్యవిభాగం)/సంతకవిటి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా ఐతేపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంతకవిటి మండలం మేడమిర్తికి చెందిన ఏడుగురి మృతదేహాలకు అధికారులు శవపరీక్షలు పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. రెండు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. హైమావతి అన్న అసిరినాయుడుతో కలిసి ఆర్మీలో పనిచేసిన తిరుపతికి చెందిన వి.కేశవరెడ్డి, ఎస్వీ చలపతి మార్చురీ వద్దకు వచ్చి సహకారం అందించారు. మృతదేహాలు మంగళవారం స్వగ్రామానికి చేరనున్నాయి.

దహన సంస్కారాలకు ఏర్పాట్లు: మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేందుకు స్వగ్రామం మేడమిర్తిలోని నాగావళి నది తీరంలో ఏర్పాట్లు చేశారు. కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున చేరుకున్నారు. రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రమైంది. జడ్పీ ఉపాధ్యక్షుడు జగన్‌మోహనరావు, తహసీల్దార్‌ బి.మురళీమోహన్‌, మాజీ ఎంపీపీ కె.అప్పలనాయుడు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.


వైద్యుల పర్యవేక్షణలోనే జషిత: ప్రమాదంలో మృత్యుంజయురాలిగా బయటపడ్డ చిన్నారి జషిత రుయా చిన్నపిల్లల వార్డులోనే ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈమెను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్‌ను ఉంచారు. చిన్నారి కడుపులోని అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని