logo

ఓటీఎస్‌పై తెదేపా నిరసన

గతంలో పేదలకు కేటాయించిన ఇళ్లకు రూ.10 వేలు చెల్లిస్తే హక్కు కల్పిస్తామని ప్రభుత్వం ఒత్తిడి చేయడం తగదని తెదేపా నాయకులు పేర్కొన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం....

Published : 07 Dec 2021 05:45 IST


పలాస పట్టణంలో నినాదాలు చేస్తున్న తెదేపా కార్యకర్తలు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: గతంలో పేదలకు కేటాయించిన ఇళ్లకు రూ.10 వేలు చెల్లిస్తే హక్కు కల్పిస్తామని ప్రభుత్వం ఒత్తిడి చేయడం తగదని తెదేపా నాయకులు పేర్కొన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కింద వైకాపా నాయకులు చేస్తున్న ప్రచారం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటీఎస్‌ను వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులు సోమవారం నిరసన వ్యక్తం చేశాయి. ఎక్కడికక్కడ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు. ప్రజలెవరూ డబ్బులు కట్టొద్దని కోరారు. ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పలాసలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ వజ్జ బాబురావు, శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కోండ్రు మురళీమోహన్‌, కిమిడి కళావెంకటరావు, పాలకొండ ఇన్‌ఛార్జి నిమ్మక జయరాజ్‌, తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని