logo
Published : 07 Dec 2021 06:07 IST

హోంగార్డుల సంక్షేమానికి కృషి

హోంగార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ అమిత్‌బర్దార్‌ తెలిపారు. ఎచ్చెర్లలోని జిల్లా సాయుధ పోలీసు దళం క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన హోంగార్డుల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వేతన పెంపు, ఆరోగ్య కార్డులు, వ్యక్తిగత, ప్రమాద బీమా అమలయ్యేలా చూస్తామన్నారు. అదనపు ఎస్పీలు కె.శ్రీనివాసరావు, టి.పి.విఠలేశ్వరరావు, డీఎస్పీలు మహేంద్ర, ఎన్‌.ఎస్‌.ఎస్‌.శేఖర్‌, జి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు మన్మధరావు, ప్రదీప్‌, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, ఎచ్చెర్ల


అంబేడ్కర్‌ ఆశయాలు నెరవేర్చాలి

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలు నెరవేర్చాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, జూనియర్‌ కళాశాల, శ్రీకాకుళం నగరంలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

-న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, శ్రీకాకుళం నగరం


అయ్యా.. ఆదుకోండి!

 

‘అయ్యా... మేము ప్రతి నెలా డయాలసిస్‌ చేయించుకుంటున్నాం. నాలుగు నెలలుగా పింఛను అందడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఆదుకోండి.’ అని పలు మండలాలకు చెందిన 30 మంది బాధితులు కలెక్టర్‌శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ను కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో వీరు వినతిపత్రం అందించారు. మొత్తం 225 అర్జీలు వచ్చాయి. జేసీలు ఎం.విజయసునీత, కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములునాయుడు, డీఆర్వో దయానిధి పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)


సీసీఎస్‌ సంరక్షణకు కృషి

ఆర్టీసీలో ఉన్న సీసీఎస్‌(క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ)సంరక్షణకు కృషి చేస్తామని ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు చెప్పారు. జిల్లాకు వచ్చిన ఆయన యూనియన్‌ కార్యాలయంలో సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీసీఎస్‌ ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ యూనియన్‌తో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఆరు నెలల్లోనే రుణాలు ఇప్పిస్తామని, వడ్డీరేట్లు తగ్గిస్తామని వివరించారు. సమావేశంలో ప్రాంతీయ అధ్యక్షుడు వై.అప్పయ్య, ప్రాంతీయ కార్యదర్శి రాములు, జోనల్‌ కార్యదర్శి ఎంవీఆర్‌ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, అరసవల్లి


వలకు చిక్కిన అరుదైన చేప

మండలంలోని కిట్టాలపాడు సమీపంలో వంశధార ఎడమ ప్రధాన కాలువలో సోమవారం స్థానికులు వేసిన వలకు చిక్కిన చేప వీపుపై పాము పొలుసు మాదిరిగా ఉంది. ఈ రకం చేపను వాడుక భాషలో ‘సకర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌’గా పిలుస్తారని, శాస్త్రీయ నామం ‘హైపోస్టొమస్‌ ప్లికోస్టొమస్‌’ అని పాలకొండ డివిజన్‌ మత్స్యశాఖ ఎఫ్‌డీవో డి.గోపికృష్ణ తెలిపారు. ఈ రకం ఎక్కువగా కొల్లేరు సరస్సులో కనిపిస్తాయని, వీటిని తినేందుకు ఎవరూ ఇష్టపడరన్నారు.

- న్యూస్‌టుడే, హిరమండలం


వైద్యశాల... పాఠశాలను తలపించేలా.!

గోడలపై ఆకట్టుకునేలా ఉన్న చిత్రాలను చూసి ఇదేదో పాఠశాల అనుకుంటున్నారా.. కాదండీ ఇవి పాలకొండ ప్రాంతీయాసుపత్రి చిన్నపిల్లల వార్డులోనివి. చికిత్స పొందే పిల్లలకు ఆసుపత్రిలో ఉన్నామన్న భావన కలగకుండా ఇటీవల ఇలా తీర్చిదిద్దామని పర్యవేక్షకులు జె.రవీంద్ర తెలిపారు.

- న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం


డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దు

 

మండలంలోని టీడీపారాపురం గ్రామం వద్ద డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్థులు సోమవారం పాలకొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు వందల మంది గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ కక్షతోనే తమ గ్రామం వద్ద చెత్త కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. యార్డు ఏర్పాటు చేస్తే సాగునీటి వనరుల కలుషితంతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌, కమిషనర్‌ ఎన్‌.రామరావులకు వినతిపత్రాలను అందించారు.

- న్యూస్‌టుడే, పాలకొండ

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని