logo

15 నుంచి ఎకోరిట్రీట్‌ ఉత్సవాలు

ఒడిశా పర్యాటక ప్రదేశాలు శీతాకాలపు ఆతిథ్యానికి ఆహ్వానం పలుకుతున్నాయని ఒడిశా పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి దుర్గాప్రసాద్‌ మహాపాత్ర్‌ అన్నారు.

Published : 07 Dec 2021 06:07 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఒడిశా పర్యాటక ప్రదేశాలు శీతాకాలపు ఆతిథ్యానికి ఆహ్వానం పలుకుతున్నాయని ఒడిశా పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి దుర్గాప్రసాద్‌ మహాపాత్ర్‌ అన్నారు. విశాఖలోని ఓ హోటల్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. డిసెంబరు 15 నుంచి ఎకోరిట్రీట్‌ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. 3 నెలల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. పర్యాటక ప్రదేశాల్లో ఇవి నిర్వహిస్తామన్నారు. జల క్రీడలు, బోటు షికార్లు, జంగిల్‌ ట్రైల్స్‌, సైకిలింగ్‌ టూర్లు వంటివి ఉంటాయన్నారు. నోరూరించే రుచులతో వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ డివిజనల్‌ మేనేజర్‌ పి.కె.చాంద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని