logo

సీఎం కప్‌ షెడ్యూల్‌ ఖరారు

జిల్లాస్థాయి సీఎం కప్‌ ఆటల పోటీలకు షెడ్యూల్‌ ఖరారైనట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు బి.శ్రీనివాస్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 07 Dec 2021 06:07 IST


క్యూఆర్‌ కోడ్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాస్థాయి సీఎం కప్‌ ఆటల పోటీలకు షెడ్యూల్‌ ఖరారైనట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు బి.శ్రీనివాస్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కబడ్డీ, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, బాస్కెట్‌బాల్‌, బాల్‌బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, బాక్సింగ్‌ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయని చెప్పారు. వాటిలో పాల్గొనదలచిన అభ్యర్థులు 7 నుంచి 9వ తేదీలోగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. www.dsasrikakulam.com వెబ్‌సైట్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని