logo
Published : 09/12/2021 04:22 IST

21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ

? ఒడిశా సరకు వల్ల జిల్లా అన్నదాతలకు నష్టం జరుగుతోంది. దీన్ని ఎలా నిలువరిస్తున్నారు.

● అక్కడ తక్కువ ధరకు కొని జిల్లాలోకి తీసుకురావడంతో ఇక్కడి రైతులకు మద్దతు ధర లభించడం లేదు. దీని నివారణకు సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను బలోపేతం చేశాం. రెవెన్యూ, రవాణా, విజిలెన్స్‌ సిబ్బంది అన్ని వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు.

సమస్యలుంటే ఈ ఫోన్‌ నంబర్లకు చేయొచ్చు

08942 226526 70754 39959 70758 39959

? భారీ వర్షాలకు ధాన్యం తడిసి రంగుమారాయి. కొన్ని మొలకెత్తాయి. వాటిని కొనుగోలు చేస్తున్నారా.

● వర్షాలకు కొన్నిచోట్ల గింజలు మొలకెత్తడం, రంగుమారడం నిజమే. వాటి కొనుగోలు గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. రైతులకు ఈ విధంగా నష్టం వాటిల్లిందనే సమాచారం ఆర్బీకే స్థాయిలోనే ఉంది. ఆదేశాలు, విధి విధానాలు వచ్చిన వెంటనే అవగాహన కల్పించి పంట కొనుగోలు చేస్తాం.

ఈనాడు డిజిటల్‌: ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కారణం?

జేసీ: అన్నిచోట్లా కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉన్నాయి. రెండు రోజుల కిందట వరకూ వర్షాలు కురవడం, శీతల గాలుల వల్ల తేమశాతం అధికంగా వస్తోంది. అది తగ్గాలంటే ఇంకా నాలుగైదు రోజులు కల్లాల్లోనే పంట ఆరబెట్టాలి. ఆ తర్వాత నుంచి కొనుగోళ్లు వేగవంతమవుతాయి. తేమశాతం 17 లోపు ఉంటే రైతులు సంబంధిత సిబ్బందికి సమాచారం ఇచ్చి, టోకెన్‌ తీసుకుని పంట అమ్ముకోవచ్ఛు

21 రోజుల్లోనే

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, నిబంధనలకు అనుగుణంగా రైతులు సమీపంలోని రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకోవచ్చని సంయుక్త కలెక్టరు ఎం.విజయసునీత పేర్కొన్నారు. 21 రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట విక్రయం విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్‌ రూం నంబర్లకు ఫోన్‌ చేసి సాయం పొందవచ్చని చెబుతున్న ఆమెతో ‘ఈనాడు డిజిటల్‌’ ముఖాముఖి..

? ఈసారి సేకరణ లక్ష్యం ఎంత? ఇప్పటికి ఎంత సేకరించారు.

● జిల్లాలో 4.93 లక్షల ఎకరాల్లో 2.88 లక్షల మంది రైతులు వరి సాగు చేశారు. 68 వేల మంది ఈ-కేవైసీ కాలేదు. వారందరి నుంచి 7.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలోని 798 ఆర్బీకేల పరిధిలో కొనుగోలు కేంద్రాలు, 371 సపోర్టింగ్‌ ఏజెన్సీలను ఏర్పాటుచేసి సిబ్బందిని కేటాయించాం. ఇప్పటివరకూ 2 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేశాం.

?గతేడాది ఎదురైన ఇబ్బందు లను ఈసారి అధిగమిస్తారా.

● గతంలో రైతులే ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరకు తీసుకెళ్లారు. కొందరు మిల్లర్లు సకాలంలో వాటిని తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి మిల్లర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్బీకేల దగ్గర రైతుల నుంచి తీసుకున్న ధాన్యాన్ని సిబ్బందే నిర్దేశించిన మిల్లుకు తరలిస్తారు. అన్నిచోట్లా పర్యవేక్షణకు అధికారులను నియమించాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం.

?గోనె సంచులు సరిపడా లేవు. ఎలా సమకూరుస్తున్నారు.

● నిర్దేశిత ధాన్యం సేకరణకు 2 కోట్లకు పైగా గోనె సంచులు అవసరం. ఇప్పటివరకు 1.14 కోట్లు సమకూర్చాం. వాటిని కేటగిరీల వారీగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాం. డిసెంబరు చివరి నుంచి జనవరి వరకు కొనుగోళ్లు ముమ్మరంగా ఉంటాయి. ఆ సమయానికి మిగిలినవి సమీకరిస్తాం. కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.

మద్దతు ధరలు ఇలా.. (క్వింటాల్‌కు రూ.లలో)

గ్రేడ్‌-ఎ రకం : 1,960

సాధారణం : 1,940

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని