logo

డిగ్రీ నాలుగో సెమిస్టర్‌లో 32.64 శాతం ఉత్తీర్ణత

డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను బీఆర్‌ఏయూ అధికారులు బుధవారం విడుదల చేశారు. అన్ని కోర్సులు కలిపి మొత్తం 11,100 మంది హాజరుకాగా 3,624 మంది ఉత్తీర్ణులయ్యారు.

Published : 09 Dec 2021 04:22 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను బీఆర్‌ఏయూ అధికారులు బుధవారం విడుదల చేశారు. అన్ని కోర్సులు కలిపి మొత్తం 11,100 మంది హాజరుకాగా 3,624 మంది ఉత్తీర్ణులయ్యారు. 32.64 ఉత్తీర్ణతా శాతం లభించింది. బీబీఏలో 84, బీఏలో 283, బీఎస్సీలో 2,792, బీకాం(జనరల్‌)లో 177, బీకాం(కంప్యూటర్స్‌)లో 237, బీసీఏలో 51 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా 15 రోజుల్లోగా పునర్‌ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని