logo

నమూనాల సేకరణ

దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల సంతబొమ్మాళి మండలంలోని స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్‌ అనుమానంతో అధికారులు ఇతని నమూనాలను హైదరాబాద్‌ సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు.

Published : 09 Dec 2021 04:22 IST

గుజరాతీపేట(శ్రీకాకుళం)/ సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల సంతబొమ్మాళి మండలంలోని స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్‌ అనుమానంతో అధికారులు ఇతని నమూనాలను హైదరాబాద్‌ సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో 24 మందికి నమూనాలు సేకరించగా ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో బుధవారం మరోసారి డిప్యూటీ డీఎంహెచ్‌వో లీల పర్యటించి మరో 46 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఈ నివేదిక గురువారానికి రానున్నట్లు సమాచారం. మరోపక్క విదేశం నుంచి వచ్చిన వ్యక్తితో సంబంధాలున్న వారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో జగన్నాథరావు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తాజాగా పాజిటివ్‌ వచ్చిన ఇద్దరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని