logo

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

శ్రీకాకుళం నగరంలోని జీటీరోడ్డులో సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ 26వ షోరూం ప్రారంభోత్సవానికి సినీనటి ప్రగ్యాజైస్వాల్‌ హాజరై సందడి చేశారు. ముందుగా స్పీకర్‌ తమ్మినేని సీీతారాం రిబ్బన్‌ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో

Published : 09 Dec 2021 06:21 IST

 

జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని జీటీరోడ్డులో సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ 26వ షోరూం ప్రారంభోత్సవానికి సినీనటి ప్రగ్యాజైస్వాల్‌ హాజరై సందడి చేశారు. ముందుగా స్పీకర్‌ తమ్మినేని సీీతారాం రిబ్బన్‌ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు భాగస్వాములు అయ్యారు. షాపింగ్‌మాల్‌ డైరెక్టర్లు సురేష్‌ శీర్ణ, అభినయ్‌, రాకేష్‌, కేశవ్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశంలోని ప్రముఖ నగరాలకు విస్తరించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విస్తృతశ్రేణికు చెందిన అత్యంత నాణ్యమైన ష్యాషన్‌ ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తున్నట్లు చెప్పారు. తూర్పుకాపు, కళింగవైశ్య కార్పొరేషన్ల ఛైర్మన్లు మామిడి శ్రీకాంత్‌, అంధవరపు సూరిబాబు, వైకాపా నాయకులు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని