logo

AP News: సచివాలయాల ద్వారా చేపల విక్రయాలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో మినీ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌ లెట్లను ఏర్పాటు చేయనున్నామని, వాటి ద్వారా చేపలు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం దీనిపై

Updated : 06 Jan 2022 14:17 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయాల్లో మినీ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌ లెట్లను ఏర్పాటు చేయనున్నామని, వాటి ద్వారా చేపలు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. పాలకొండ, శ్రీకాకుళం, పలాసల్లో మూడు హబ్‌లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెప్పారు. వాటి నుంచి 30 నుంచి 35 కిలోమీటర్లకు ఒక్కోటి చొప్పున రిటైల్‌ అవుల్‌లెట్లను పెడతామన్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌శాఖ జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుబజారులో స్టాళ్లు ఖాళీగా ఉంటే చేపలు విక్రయించేందుకు అద్దెకు కేటాయిస్తామని చెప్పారు. సమావేశంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు రుణాలను అందజేయాలి...
లబ్ధిదారులకు రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో టిడ్కో గృహాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వలస వెళ్లిన లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవచ్చని, మృతి చెందిన లబ్ధిదారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు లీగల్‌ హెయిర్‌ పత్రాలను తీసుకుని గృహాలను అప్పగించి రుణాలను ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్‌ల్లో గృహనిర్మాణాలు వేగంగా ప్రారంభించేలా చూడాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని