logo

Siberian crane:వెళ్లిరా.. నేస్తమా..!

ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో ఇంతవరకు కనువిందు చేసిన విదేశీ విహంగాలు ఒక్కొక్కటిగా సైబీరియా తిరిగి వెళుతున్నాయి. రెండు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

Published : 15 Jan 2022 06:50 IST

 న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో ఇంతవరకు కనువిందు చేసిన విదేశీ విహంగాలు ఒక్కొక్కటిగా సైబీరియా తిరిగి వెళుతున్నాయి. రెండు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

జాతిని వృద్ధి చేసుకునేందుకు వచ్చి..: తేలుకుంచి గ్రామానికి సైబీరియా నుంచి ఏటా విహంగాలు తమ జాతిని వృద్ధి చేసుకునేందుకు వస్తుంటాయి. ఏటా జూన్‌ నెలలో సుమారు మూడు వేల పక్షులు సైబీరియా నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటాయి. ఆరు నెలల పాటు ఇక్కడే వుండి, ఈ ప్రాంత పక్షి ప్రేమికులను అలరిస్తుంటాయి. ఇక్కడికి వచ్చి, జంటలు కట్టి, గూళ్లు నిర్మించుకొని అందులో గుడ్లు పెడతాయి. ఒక్కొక్కటి రెండు నుంచి నాలుగు గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి, పిల్లలకు రెక్కలొచ్చి ఎగరగలిగే వరకు ఇక్కడే ఉంటాయి. అనంతరం కూనలతో సైబీరియా తిరిగివెళ్తాయి.. మూడు వేలుగా వచ్చిన ఇవి పిల్లలతో కలిపి పదివేలకు పైగా తిరిగి వెళతాయి.

బోసిపోయిన ప్రాంతం: పక్షులు ఈ ప్రాంతాన్ని విడిచివెళ్తుండటంతో చెట్లు, కువకువలు లేక బోసిపోయాయి. తేలుకుంచి గ్రామంలో నిశ్శబ్దం అలముకుంటోంది. మళ్లీ వచ్చే జూన్‌లో చిరునామా తప్పని ఉత్తరంలా తిరిగి ఇక్కడికి వస్తాయి. వీటి రాకతోనే తమ ప్రాంతం సుభిక్షమవుతుందని గ్రామస్థుల నమ్మకం. మళ్లీ అవి తిరిగివచ్చే వరకు వేచిచూస్తామని వారంటున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని