logo

అతివలకు అండగా181

మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతోనూ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. చాలా ఘటనల్లో బాధితులు ఎక్కడికి వెళ్లాలో... ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటివారి కోసం మేమున్నామంటోంది వన్‌స్టాప్‌ కేంద్రం. 181 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయగానే తక్షణ స్పందన లభిస్తోంది.

Published : 17 Jan 2022 04:04 IST


బాలికలకు అవగాహన కల్పిస్తున్న వన్‌స్టాప్‌ కేంద్రం సిబ్బంది

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతోనూ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. చాలా ఘటనల్లో బాధితులు ఎక్కడికి వెళ్లాలో... ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటివారి కోసం మేమున్నామంటోంది వన్‌స్టాప్‌ కేంద్రం. 181 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయగానే తక్షణ స్పందన లభిస్తోంది.

జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో 2015లో వన్‌స్టాప్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరిని ఆశ్రయించిన వనితలకు ఎలాంటి కష్టమొచ్చినా పూర్తి సహకారం అందిస్తున్నారు. నిరంతరం సేవలందించేందుకు ఇక్కడ ప్రస్తుతం 15 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటర్‌, కౌన్సిలర్‌, న్యాయవాది, వైద్యులు, సాంకేతిక సిబ్బంది, ఎస్‌.ఐ., తదితరులు వీరి కోసం అందుబాటులో ఉంటున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు.

అందిస్తున్న సేవలివే...

అత్యాచారం, గృహహింస, చిన్నారులపై లైంగిక వేధింపులు, యాసిడ్‌ దాడులు, సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణ, వరకట్నం వేధింపులు, బాల్యవివాహాలు వంటి వాటిల్లో బాధితులకు తక్షణ సాయం అందిస్తారు. l వైద్య సదుపాయం కల్పిస్తారు. l ఫిర్యాదుదారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టేందుకు ఓ పోలీసు అధికారిని కేటాయిస్తారు. న్యాయసలహాలతో పాటు అన్ని సహాయక చర్యలు ఉచితంగానే ఇస్తారు. l బాధిత మహిళలకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ అందించి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతారు. l టోల్‌ఫ్రీ నంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌...వివిధ సమస్యలపై ఇక్కడికి వచ్చే బాధిత మహిళలకు నిపుణులతో మానసిక, సామాజిక అంశాలపై కౌన్సిలింగ్‌ ఇప్పిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపుతారు. ఓ న్యాయవాది న్యాయ సహాయంతో పాటు తగిన సూచనలందిస్తారు. బాధితురాలి అభీష్టం మేరకు కేసుకి సంబంధించి సలహాలిస్తారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు 2019లో 155, 2020లో 19, 2021లో ఇప్పటివరకు 71 చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు.

సహకారం అందిస్తున్నాం... సమాజంలో హింస, దాడులకు గురవుతున్న బాధిత మహిళలకు వన్‌స్టాప్‌ కేంద్రం అండగా ఉంటోంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఇక్కడ 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏ వేళల్లో బాధితులు వచ్చినా అన్ని విధాల సహకారం అందిస్తున్నాం. - వై.హిమబిందు, అడ్మినిస్ట్రేటర్‌, వన్‌స్టాప్‌ కేంద్రం

అయిదేళ్లలో ఇదీ పరిస్థితి..

సంవత్సరం ఫిర్యాదులు

2017 13

2018 44

2019 62

2020 86

2021 53

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని