logo

బరువెత్తితే బంగారమే..!

చదువుకునే రోజుల్లో పరుగులో రాణించాలని అడుగుపెట్టినా.. ఎత్తు అడ్డువచ్చింది. అదే అనంతరం ఆయనకు వరమైంది. పవర్‌లిఫ్టింగ్‌ వైపు ఆసక్తిని మళ్లించాడు. అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించి భళా అనింపించాడు.. పలాసకు చెందిన సతీష్‌.

Published : 17 Jan 2022 04:04 IST


కుటుంబ సభ్యులు, సాధించిన పతకాలతో సతీష్‌కుమార్‌

పలాస, న్యూస్‌టుడే: చదువుకునే రోజుల్లో పరుగులో రాణించాలని అడుగుపెట్టినా.. ఎత్తు అడ్డువచ్చింది. అదే అనంతరం ఆయనకు వరమైంది. పవర్‌లిఫ్టింగ్‌ వైపు ఆసక్తిని మళ్లించాడు. అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించి భళా అనింపించాడు.. పలాసకు చెందిన సతీష్‌.

మెలకువలు నేర్చుకుంటూ..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో గోరువీధికిచెందిన యాదం ఆంజనేయులు, సావిత్రి కుమారుడు సతీష్‌. 7వ తరగతి చదువుకునే రోజుల నుంచే చిన్నచిన్న బరువులు ఎత్తుతూ స్థానికంగా జరిగే పోటీల్లో ప్రతిభ చూపించేవాడు. నాలుగేళ్లుగా విశాఖపట్నంలో కోచ్‌ కోటేశ్వరరావు వద్ద మెలకువలు నేర్చుకుని, పతకాల సాధనలో దూసుకుని వెళుతున్నాడు. జిల్లా స్థాయిలో 59 కేజీల విభాగంలో ప్రథమంగా నిలుస్తూ రాష్ట్ర స్థాయిలో చెన్నై, బెంగళూరు, జాతీయ స్థాయిలో చెన్నై స్వర్ణ పతకాలు సాధించాడు.

ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌కు ఎంపికై..

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో జరిగిన పోటీల్లో పాల్గొని ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌కు ఎంపిక అయ్యాడు. టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ఈ పోటీల్లో ఓపెన్‌ సీనియర్‌ కేటగిరి విభాగంలో స్కాడ్‌లో 200, డెడ్‌లిఫ్ట్‌లో 200, బెంచ్‌ప్లస్‌లో 130కేజీలు ఎత్తి బంగారు పతకం సాధించాడు. తల్లిదండ్రులు మేదర వృత్తి చేస్తుండగా తమ్ముడు సురేష్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తూ అన్నయ్య సతీష్‌కు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు.

కామన్‌వెల్త్‌లో పోటీ.. కుటుంబ సభ్యుల సహకారం, కోచ్‌ సూచనలతో కామన్‌వెల్త్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో వెళుతున్నా. ఇస్తాంబుల్‌లో స్వర్ణ పతకం రావటం ఆనందంగా ఉంది. సొంతూరిలో ఆదరించిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. -యాదం సతీష్‌కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని