logo

జనజాతర

ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస కొండపై ఉన్న సంగమేశ్వరస్వామి ఆలయానికి శని, ఆదివారాల్లో భక్తులు పోటెత్తారు. ఏటా సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ సారి జరిగిన జాతరకు జిల్లాలోని వివిధ మండలాలతో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల

Published : 17 Jan 2022 04:04 IST


అప్పన్నమ్మ దర్శనానికి బారులుదీరిన భక్తుల

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస కొండపై ఉన్న సంగమేశ్వరస్వామి ఆలయానికి శని, ఆదివారాల్లో భక్తులు పోటెత్తారు. ఏటా సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ సారి జరిగిన జాతరకు జిల్లాలోని వివిధ మండలాలతో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమదాలవలస సీఐ పి.పైడయ్య, ఎస్సై వై.కృష్ణలు సిబ్బందితో ఆలయ ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామంలోని అప్పన్నమ్మ తల్లి ఆలయం వద్ద కనుమ సంబరాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఏటా కనుమ పండగ రోజున ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం వేకువ జాము నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎస్‌.ఐ. రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు జాతీయ రహదారిపై వాహనాలను నియంత్రించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

సంగమేశ్వరుడి కొండపై రద్దీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని