logo

గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు

కొవిడ్‌ దృష్ట్యా నిబంధనలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో రిపబ్లిక్‌ డే వేడుకలపై సమీక్షించారు.

Published : 18 Jan 2022 06:20 IST


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లఠ్కర్‌, చిత్రంలో జేసీలు, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కొవిడ్‌ దృష్ట్యా నిబంధనలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో రిపబ్లిక్‌ డే వేడుకలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పురుషుల డిగ్రీ కళాశాలలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ ప్రభుత్వశాఖల ప్రగతిని తెలియజేసే శకటాలు, ప్రదర్శనశాలలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత డీఈవోకు అప్పగించారు. ఈ నెల 20 నాటికి ప్రశంసాపత్రాలకు జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ఇతరులకు ప్రేరణగా ఉండే ఉత్తమ ఉద్యోగులను మాత్రమే ఎంపిక చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జేసీలు ఎం.విజయసునీత, ఆర్‌.శ్రీరాములునాయుడు, ఇన్‌ఛార్జి డీఆర్వో సీతారామ్మూర్తి, అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్‌, ఆర్డీవో ఐ.కిశోర్‌, సీపీవో ఎం.మోహనరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు, డీఈవో బి.లింగేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని