logo

‘గడువులోగా పూర్తికాకుంటే చర్యలు’

జిల్లాలో నిర్దిష్ట లక్ష్యాల మేరకు సకాలంలో అన్ని రకాల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, లేకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని గృహనిర్మాణ సంస్థ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌ పాండే హెచ్చరించారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం

Published : 18 Jan 2022 06:20 IST


ప్రసంగిస్తున్న రాహుల్‌పాండే, చిత్రంలో ఇతర అధికారులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో నిర్దిష్ట లక్ష్యాల మేరకు సకాలంలో అన్ని రకాల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, లేకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని గృహనిర్మాణ సంస్థ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌ పాండే హెచ్చరించారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం జిల్లాలో గృహనిర్మాణాల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. జగనన్న కాలనీలు, సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జూన్‌ నాటికి శతశాతం పనులు ప్రారంభం కావాలని సూచించారు. జులై నెలాఖరుకు జిల్లాకు మంజూరైన ఇళ్లలో 50 శాతం కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించాలని, నాణ్యతతో పనులు జరిగేలా చూడాలన్నారు. సంతబొమ్మాళి, నందిగాం, మందస, తదితర మండలాల్లో ఆశించిన ప్రగతి లేకపోవడంతో సంబంధిత ఏఈలను ప్రశ్నించారు. జేసీ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాకు 91,660 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 83,335 ఇళ్లకు మ్యాపింగ్‌, 80 ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేసినట్లు వివరించారు. వాటిని మార్చి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో గృహ నిర్మాణసంస్థ పీడీ ఎన్‌.గణపతి, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని