logo

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 18 Jan 2022 06:20 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 31వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, లేకుంటే రూ.100 అపరాధ రుసుం విధిస్తామని చెప్పారు.

అనుమతి మేరకే..: వివాహాలు, సభలు, సమావేశాలకు బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్‌లో 100 మంది వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. సినిమా థియేటర్లలోనూ 50 శాతం మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రెండో ఆటను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించే దుకాణాలు, ఇతర సంస్థలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు తీవ్రత ఆధారంగా అపరాధ రుసుం వేస్తామన్నారు. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.


‘ఉద్యోగోన్నతి ఉత్తర్వుల జారీ హర్షణీయం’

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఎంపీడీవోలు, అర్హత కలిగిన వారికి ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని ఎంపీడీవోల సంఘ జిల్లా అధ్యక్షుడు కె.హేమసుందరరావు, అధ్యక్షురాలు ఎం.రోజారాణి, ప్రధాన కార్యదర్శి ఎం.కిరణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని