logo

జాతీయస్థాయిలో రాణించాలి

జాతీయస్థాయి ఈత పోటీల్లో క్రీడాకారులు రాణించాలని జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు హారికాప్రసాద్‌, మామిడి విష్ణుమూర్తి ఆకాంక్షించారు. ఇటీవల కృష్ణాజిల్లా ఈడుపుగల్లులో జరిగిన రాష్ట్రస్థాయి వింటర్‌ అక్వాటిక్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఏడు స్వర్ణాలు,

Published : 18 Jan 2022 06:20 IST


విజేతలను అభినందిస్తున్న డీఎస్‌ఏ ముఖ్య శిక్షకులు శ్రీనివాస్‌కుమార్‌, తదితరులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జాతీయస్థాయి ఈత పోటీల్లో క్రీడాకారులు రాణించాలని జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు హారికాప్రసాద్‌, మామిడి విష్ణుమూర్తి ఆకాంక్షించారు. ఇటీవల కృష్ణాజిల్లా ఈడుపుగల్లులో జరిగిన రాష్ట్రస్థాయి వింటర్‌ అక్వాటిక్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలు దీక్షా బెహర, దరహాస్‌, బి.నవ్యశ్రీ, వై.బోణియశ్వంత్‌, గాయత్రి, హర్షిత, డి.షణ్ముఖరాజ్‌లను శ్రీకాకుళం నగరంలోని డీఎస్‌ఏ ఈతకొలను వద్ద సోమవారం అభినందించారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ ముఖ్యశిక్షకులు బడి శ్రీనివాస్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌.కాంతారావు, డీఎస్‌ఏ ఈత శిక్షకులు డి.మురళీధర్‌, నాని, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని