logo

మద్యం అమ్మకాలు వద్దని తీర్మానం

మద్యం అమ్మకాలు జరపరాదంటూ వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీ ప్రజలు తీర్మానించారు. సోమవారం గ్రామ సర్పంచి కె.మల్లేశ్వరరావు నేతృత్వంలో గ్రామస్థులు ఈ మేరకు నిర్ణయించారు. సచివాలయ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు.

Published : 18 Jan 2022 06:20 IST


తీర్మాన పత్రాన్ని సచివాలయ అధికారులకు అందజేస్తున్న సర్పంచి మల్లేశ్వరరావు

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం అమ్మకాలు జరపరాదంటూ వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీ ప్రజలు తీర్మానించారు. సోమవారం గ్రామ సర్పంచి కె.మల్లేశ్వరరావు నేతృత్వంలో గ్రామస్థులు ఈ మేరకు నిర్ణయించారు. సచివాలయ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు. వెంకటాపురం, అనంతగిరి కాలనీ పరిసరాల్లో అక్రమ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగున్నాయని, దీంతో గ్రామంలో ఘర్షణలు పెరిగి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచి తెలిపారు. ఇందుకు వ్యతిరేకంగా ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని