logo

రైలు పట్టాలు దాటుతూ... మృత్యుఒడికి..!

ఇచ్ఛాపురం పుర పరిధి బెల్లుపడ కాలనీ వద్ద పట్టాలను దాటుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కవిటి మండలంలోని జల్లుపుట్టుగకు చెందిన జల్లు సాయికుమార్‌ (29)గా గుర్తించినట్లు పలాస జీఆర్పీ రమేష్‌ తెలిపారు.

Updated : 21 Jan 2022 06:06 IST


సాయికుమార్‌ (దాచిన చిత్రం)

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పుర పరిధి బెల్లుపడ కాలనీ వద్ద పట్టాలను దాటుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కవిటి మండలంలోని జల్లుపుట్టుగకు చెందిన జల్లు సాయికుమార్‌ (29)గా గుర్తించినట్లు పలాస జీఆర్పీ రమేష్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సాయికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్లుగా ఇంటివద్దనే ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. గురువారం ఉదయం ఇచ్ఛాపురం వెళ్లి వస్తానని బయలుదేరివచ్చారు. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన జీఆర్పీ దళం అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు చేరుకున్నారు. మృతదేహాన్ని పలాస ఆసుపత్రికి తరలించి, శవపంచనామా చేయించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

లావేరు గ్రామీణం, న్యూస్‌టుడే: బెజ్జిపురం గ్రామానికి చెందిన ఇజ్జాడ వెంకటరమణ(61) పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను నిత్యం మద్యం తాగి ఇంటికి రావడంతో బుధవారం కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ పి.రామారావు తెలిపారు. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఇద్దరికి వివాహాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని