logo

రైలు ఢీకొని వ్యక్తి మృతి

మందస మండలం బాలిగాం గేటు సమీపంలో రైలు ఢీకొని మానసిక వికలాంగుడు(18) మృతిచెందాడు. తండ్రితో కలసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ముందు వెళ్లిపోగా వెనుక వస్తున్న కుమారుడిని

Published : 22 Jan 2022 04:52 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: మందస మండలం బాలిగాం గేటు సమీపంలో రైలు ఢీకొని మానసిక వికలాంగుడు(18) మృతిచెందాడు. తండ్రితో కలసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ముందు వెళ్లిపోగా వెనుక వస్తున్న కుమారుడిని రైలు ఢీకొనడంతో మృతిచెందాడని, దీనిపై తమకెలాంటి ఫిర్యాదూ అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు.


చరవాణుల దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు

విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: రైళ్లలో ప్రయాణికుల కళ్లుగప్పి సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతానికి చెందిన అమిత్‌కుమార్‌(32)ను వాల్తేర్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ పి.సి.ఎం.రావు బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుడు బ్రహ్మపూర్‌-విజయనగరం మధ్య కొంత కాలంగా ఫోన్ల చోరీకి పాల్పడుతున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకొని విజయనగరం జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని