logo

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాన్ని వెల్లడించడం నేరమని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం లింగ నిర్ధారణ(పీసీపీఎన్‌డీటీ) చట్టంపై శుక్రవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు

Published : 22 Jan 2022 04:52 IST

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాన్ని వెల్లడించడం నేరమని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం లింగ నిర్ధారణ(పీసీపీఎన్‌డీటీ) చట్టంపై శుక్రవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  బాలికలను ఎందులోనూ తక్కువగా చూడాల్సిన అవసరం లేదని, వారి పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జేసీ డా.కె.శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా.ఎన్‌.అనూరాధ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పి.జగన్నాథరావు, డీసీహెచ్‌ఎస్‌ బి.సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌ నాటికి నీరందించేలా చూడాలి
గార, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ నాటికి నీరందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఏపీఐఈడీసీ ఈఈ కేవీవీ సుబ్రహ్మణ్యానికి సూచించారు. గార మండల కేంద్రం సమీపంలో వంశధార నదిపై నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. రూ.2.36 కోట్లతో చేపట్టిన పనులు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.90 లక్షలు బకాయిలు రాకపోవడంతో రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోయాయి. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆయన వెంట డీఈ త్రిమూర్తులు, గుత్తేదారు తిరుమలరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని