logo

ఉపాధి అవకాశాల పెంపునకు కృషి

జిల్లాలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేయాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కె.ప్రకాశరావు సూచించారు. శుక్రవారం ఆయన

Published : 22 Jan 2022 04:52 IST


కమిటీ సభ్యులకు సూచనలిస్తున్న జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కె.ప్రకాశరావు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: జిల్లాలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేయాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కె.ప్రకాశరావు సూచించారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందుకు వివిధ సంస్థల్లో అప్రెంటీస్‌ షిప్‌ శిక్షణకు ఇండస్ట్రియల్‌ సర్వే నిర్వహించాలని కోరారు. అనంతరం విద్యార్థుల శిక్షణ కోసం ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేసేలా కమిటీ పని చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు నారాయణరావు, నాగకుమారి, తేజేశ్వరరావు, రాంప్రసాద్‌, జగదీష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని