logo

అనుమతి ఉంటేనే దాణా అమ్మకం

పశువులు, కోళ్లదాణాతో పాటు పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం, ఖనిజ లవణాలు అమ్మాలంటే ఇకపై ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఒ. నం.27 పేరిట

Published : 22 Jan 2022 04:52 IST


పలాసలో నోటీసులు అందిస్తున్న పశుసంవర్థక శాఖ అధికారి

పలాస, న్యూస్‌టుడే: పశువులు, కోళ్లదాణాతో పాటు పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం, ఖనిజ లవణాలు అమ్మాలంటే ఇకపై ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఒ. నం.27 పేరిట ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జనవరి నెల నుంచి దాణా అమ్మే వ్యాపారులంతా జనవరి 31 2022 నాటికల్లా లైసెన్సులు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తోంది.

మరో పది రోజులే అవకాశం..
జిల్లాలో 252 పశుదాణా అమ్మే దుకాణాలను గుర్తించి నోటీసులు జారీచేశారు. ఇప్పటివరకు 20 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. రిటైల్‌ వ్యాపారులకు ఫీజు చెల్లింపులో కొంతమేర తగ్గింపు కోసం ఎదురుచూసినా ప్రభుత్వం మాత్రం మూడుకేటగిరీల్లోనే వసూలు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుకు మరో 10 రోజులే గడువు మిగిలి ఉంది.

జీవితకాలం రుసుము ఇలా..
జీవితకాలంలో 25 వేల మెట్రిక్‌ టన్నులు అమ్మేవారిని చిన్నతరహాగా పరిగణించి రూ.25 వేలు రుసుం విధించారు. దీన్ని చెల్లించి జీవితకాల అనుమతిని వీరు పొందవచ్చు. 25 వేల నుంచి 50వేల మెట్రిక్‌ టన్నుల వరకు మధ్యతరహాగా పరిగణించి రూ.50 వేలు రుసుం విధించారు. అంతకంటే ఎక్కువ వ్యాపారం చేసేవారంతా రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి లైసెన్సు తీసుకోని వ్యాపారుల దుకాణాలను సీజ్‌ చేయనున్నారు.


చర్యలు తీసుకుంటాం .. జిల్లాలో లైసెన్సు తీసుకున్న వ్యాపార, ఇతర సంస్థలు మాత్రమే పశుదాణా అమ్ముకోవాలి. గతంలో మాదిరిగా ఎక్కడబడితే అక్కడే అమ్మకాలు చేయాలంటే కుదరదు. నాణ్యమైన పశుదాణా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ లెసైన్సు విధానాన్ని తీసుకొచ్చింది. వచ్చేనెల నుంచి లైసెన్సు లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటాం.

- ఎం.కిశోర్‌, జేడీ, పశుసంవర్థకశాఖ, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని