logo

పురాధ్యక్షుల వార్డులో నీటి కష్టం

ఇచ్ఛాపురం పురపాలక సంఘానికి నాలుగు పర్యాయాలు అధ్యక్ష స్థానాన్ని అందించిన బెల్లుపడ వార్డులో తాగునీటి వెతలే ఈ చిత్రం. నాలుగు అడుగుల గుంతలోకి దిగితే గానీ.. బిందెడు నీరు అందని దుస్థితి. తొలి రెండు పాలక

Published : 22 Jan 2022 04:52 IST

చ్ఛాపురం పురపాలక సంఘానికి నాలుగు పర్యాయాలు అధ్యక్ష స్థానాన్ని అందించిన బెల్లుపడ వార్డులో తాగునీటి వెతలే ఈ చిత్రం. నాలుగు అడుగుల గుంతలోకి దిగితే గానీ.. బిందెడు నీరు అందని దుస్థితి. తొలి రెండు పాలక మండళ్ల కాలంలో బెల్లుపడ కొండపై చిన్న రిజర్వాయర్‌ నిర్మించి, కృష్ణసాగర్‌ బావి నుంచి నీరు తోడి ఆ ప్రాంతానికి అందించేవారు. అప్పట్లో గుంతల సమస్య లేదు. బావిలో నీరు ఇంకిపోతోందని దానిని నిలిపివేసి ప్రస్తుతం బాహుదా నీటిని అందిస్తున్నారు. దీంతో నిత్యం ఈ పాట్లు తప్పడం లేదు. బెల్లుపడకు ప్రత్యేక రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదించామని, రూ.58 కోట్లతో అమలయ్యే మంచినీటి పథకం ద్వారా సమస్య పరిష్కారం కానుందని పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి చెప్పారు.  

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని