logo

అభివృద్ధికి చరిత్రే ఆధారం

చరిత్ర అభివృద్ధికి ఆధారంగా నిలుస్తుందని, ప్రతి విద్యార్థి దేశ చరిత్రను తెలుసుకోవాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి ఎన్‌.నారాయణరావు అన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా

Published : 23 Jan 2022 03:52 IST

హెరిటేజ్‌ వాక్‌లో పాల్గొన్న డీటీవో నారాయణరావు, విద్యార్థులు

శ్రీకాకుళం అర్బన్‌, పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: చరిత్ర అభివృద్ధికి ఆధారంగా నిలుస్తుందని, ప్రతి విద్యార్థి దేశ చరిత్రను తెలుసుకోవాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి ఎన్‌.నారాయణరావు అన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి జామియా మసీదు వరకు హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. మసీదు విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ప్రభుత్వ పురుషులు, మహిళల డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెల 25న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డా.కె.శ్రీరాములు, పి.సురేఖ, ఇంటాక్‌ సభ్యులు నటుకుల మోహన్‌, డా.పి.వి.ఎస్‌.రామ్మోహన్‌, బాడాన దేవభూషణరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని